మాజీ డీజీపీ రాసిన ఆర్టికల్ ను పోస్ట్ చేసి, ఓసారి పరిశీలించాలన్న పవన్ కల్యాణ్!

  • 'తెలుగు వర్ధిల్లితేనే వెలుగు' పేరిట అరవిందరావు ఆర్టికల్
  • వ్యాసాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్
  • చాలా విశ్లేషణాత్మకంగా ఉందని కితాబు
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ అరవిందరావు రాసిన ఓ ఆర్టికల్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ ప్రభుత్వం దీన్ని పరిశీలించాలని కోరారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర మాజీ డిజీపీ శ్రీ అరవిందరావు గారు ‘తెలుగు వర్ధిల్లితేనే వెలుగు’ అన్న పేరుతో 'తెలుగు భాషా పరిరక్షణ’ గురించి  రాసిన వ్యాసం, అన్ని కోణాలలో చాల విశ్లేషణాత్మకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిలోని అంశాలని పరిశీలించాలి" అని కామెంట్ పెట్టారు. కాగా, ఈ ఆర్టికల్ నేడు 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో ప్రచురితమైంది. 
Go Back to Shorts
Pawan Kalyan
EX DGP
Aravindrao
Article
Twitter

More Telugu News